గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (15:24 IST)

సెమీ ఫైనల్ మ్యాచ్ : న్యూజిలాండ్ బ్యాటింగ్... షమీకి దక్కని చోటు...

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మాంచెష్టర్‌ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అదేసమయంలో ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రకటించిన తుది జట్టులో పేసర్ మహ్మద్ షమీకి చోటుదక్కలేదు. 
 
ఈ వరల్డ్ కప్‌లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమీకి తుదిజట్టులో స్థానం లభించకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన షమీ 14 వికెట్లు తీసి బ్యాట్స్‌మెన్ల వెన్నులో వణుకు పుట్టించిన విషయం తెల్సిందే. 
 
ఇప్పుడు కీలకమైనే సెమీఫైనల్ సమరంలో షమీని పక్కనబెట్టి, గత మ్యాచ్‌లో విఫలమైన భువనేశ్వర్‌పైనే టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. దీనిపై క్రికెట్ మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ మ్యాచ్‌లో షమీని ఆడించాల్సిందని ప్రముఖ వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు. ఏ విధంగా చూసినా టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్నది సరైన నిర్ణయం కాదని అంటున్నారు.
 
కాగా, ఓపెనర్లుగా బరిలోకి దిగిన గుప్తిల్, నికోల్స్‌లో తొలి మూడు ఓవర్లలో ఒక్క పరుగు కూడా తీయలేక పోయారు. చివరకు భువనేశ్వర్ బౌలింగ్‌లో గుప్తిల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగుకే ఆలౌట్ అయ్యాడు. ఆ తర్వాత విలియమ్సన్ బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 4 ఓవర్లలో వికెట్ నష్టానికి రెండు పరుగులు చేసింది. 
 
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టులో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధోనీ, పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ సింగ్. 
 
అలాగే, కివీస్ జట్టులో గుప్తిల్, నికోల్స్, విలియమ్సన్, టేలర్, లాథమ్, నషీమ్, గ్రాండ్‌హోం, షర్టంర్, ఫెర్గ్యూసన్, హెన్రీ, బౌల్ట్.