శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (12:00 IST)

సెమీ ఫైనల్ మ్యాచ్ : భారత జట్టులో ఎవరెవరికి చోటు దక్కొచ్చు?

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, మంగళవారం మరికొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ తలపడనుంది. మాంచెష్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎవరెవరికి చోటు కల్పించవచ్చన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
టీమిండియాలో జట్టులోకి యజువేంద్ర చాహల్‌ను రవీంద్ర జడేజా స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. 7 మ్యాచుల్లో 6 వికెట్లు మాత్రమే తీసినప్పటికీ... కుల్దీప్ యాదవ్‌కు జట్టులో స్థానం కల్పించవచ్చు. ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో ఆడాలనుకుంటున్న టీమిండియా భువనేశ్వర్ కుమార్‍‌కు కూడా అవకాశం ఇవ్వచ్చు. 
 
చివరి మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో దినేశ్ కార్తీక్‌కు స్థానం దక్కే అవకాశం ఉంది. కివీస్ జట్టును ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్స్ ముందుండి జరిపిస్తున్న విషయం తెల్సిందే. రెండు టీముల తుది జట్లు ఈ విధంగా ఉండవచ్చు. 
 
భారత జట్టు : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా.
 
న్యూజిలాండ్ జట్టు : మార్టిన్ గుప్టిల్, కొలిన్ మన్రో, కేన్ విలియంసన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ గ్రాండ్ హోమ్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్.