క్రికెట్ వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ : బెంబేలెత్తిపోతున్న న్యూజిలాండ్.. ఎందుకు?

stadium
Last Updated: మంగళవారం, 9 జులై 2019 (10:36 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరుగనుంది. మాంచెష్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో న్యూజిలాండ్ జట్టు బెంబేలెత్తిపోతోంది.

మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డే వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కివీస్ ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు ప్రపంచకప్ విజేత అయిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈనాటి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది. ఇదే కివీస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు కారుమబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. టాస్ వేసే (2.30 గంటలు) సమయంలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. ఆ తర్వాత వర్షం ఆటంకం కలిగించకపోవచ్చని పేర్కొంది. అయితే మ్యాచ్ ఆసాంతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటన్నది కివీస్ ఆందోళన చెందుతోంది.దీనిపై మరింత చదవండి :