శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (15:13 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేత ఎవరంటే..?

ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా నిలిచాడు.. రెండో సీడ్ నోవాక్ జొకోవిచ్. డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌గా బరిలోకి దిగిన జొకోవిచ్.. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ ఫైనల్లో 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో ఐదోసీడ్‌‌ డోమ్నిక్‌‌ థీమ్‌‌ (ఆస్ట్రియా)పై  విజయాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో ఎనిమిదో టైటిల్‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాకుండా.. ఒకే స్లామ్‌‌ను ఎనిమిది అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన మూడో ప్లేయర్‌‌గా జొకో నిలిచాడు. 
 
రఫెల్ నాదల్‌ (12 ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌), రోజర్‌‌ ఫెదరర్‌‌ (8 వింబుల్డన్‌‌) సరసన జొకోవిచ్ చోటు సంపాదించుకున్నాడు. ఓవరాల్‌‌గా 17 గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్స్‌‌తో ఆల్‌‌టైమ్‌‌ లిస్ట్‌‌లోనూ లెజెండ్స్‌‌కు చేరువగా వచ్చాడు. తాజా విజయంతో జొకోవిచ్‌‌.. ఏటీపీ ర్యాంకింగ్స్‌‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇకపోతే.. రఫెల్ నాదల్ ‌ రెండో ర్యాంక్‌‌కు చేరుకోగా, ఫెదరర్‌‌ మూడులోనే కొనసాగనున్నాడు.