డేటింగ్ ప్రియురాలిని పెళ్లాడిన రఫెల్ నాదల్

rafaek badak - xisco
ఠాగూర్| Last Updated: ఆదివారం, 20 అక్టోబరు 2019 (11:49 IST)
అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. గత 14 యేళ్లుగా డేటింగ్ చేస్తూ వచ్చిన ప్రియురాలు షిస్కా పెరిల్లోను పెళ్లి చేసుకున్నాడు. స్పెయిన్‌లోని దీవుల్లో అత్యంత అందమైనదిగా చెప్పుకునే మలోర్కాలో వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ పెళ్లికి స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాభినందనలు తెలిపారు. ఈ పెళ్లికి దాదాపు 350 మందికిపైగా సన్నిహితులు, అతిథులు హాజరైనట్టు సమాచారం. నాదల్ సోదరి మారిబెల్‌కు షిస్కా చిన్ననాటి స్నేహితురాలు. ఓ వేడుకలో ఆమెను కలిసిన నాదల్, తమ పరిచయాన్ని స్నేహంగా, ప్రేమగా మార్చుకున్నాడు. అయితే, వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను మాత్రం రఫెల్ నాదల్ ఇంకా మీడియాకు విడుదల చేయలేదు.దీనిపై మరింత చదవండి :