శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (10:45 IST)

యూఎస్ ఓపెన్ : రోజర్ ఫెదరర్ నాదల్ ఓటమి... పలువురు టాప్ సీడ్లు కూడా...

యూఎస్ ఓపన్ టెన్నిస్ టోర్నీలో సంచలనం నమోదైంది. స్విస్ స్టార్, మూడో సీడ్ రోజర్ ఫెదర్ ఓటమి పాలయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడెడ్ దిమిత్రోవ్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా జరిగిన పోరులో అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన దిమిత్రోవ్ చేతిలో ఫెదరర్‌కు షాక్ తగిలింది. 
 
ఆర్థర్ ఆష్ స్టేడియంలో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ లో 6-3, 4-6, 6-3, 4-6, 2-6 తేదాడో దిమిత్రోవ్ చేతిలో ఫెదరర్ ఓటమి పాలయ్యారు. ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య ఎనిమిది సార్లు టెన్నిస్ పోరు జరుగగా, ఏడు సార్లు ఫెదరరే విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లోనూ ఫెడ్ గెలుస్తాడని అందరూ భావించినా, అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపిన దిమిత్రోవ్ విజయం సాధించాడు. కాగా, ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్ లో దిమిత్రోవ్ 78వ స్థానంలో ఉండటం గమనార్హం.
 
మరోవైపు, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో టాప్ సీడ్ల పోరు ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. బెలిండా బెన్‌కిక్(స్విట్జర్లాండ్) చేతిలో మహిళల సింగిల్స్ టాప్ సీడ్ నవోమీ ఒసాక(జపాన్) పరాజయం పాలైతే.. గాయం కారణంగా వావ్రింకా(స్విట్జర్లాండ్)తో మ్యాచ్ మధ్యలోనే నొవాక్ జొకోవిచ్(సెర్బియా) వైదొలిగి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్స్‌లో విజయం సాధించిన ఐదో సీడ్ ఎలినా స్వితోలినా(ఉక్రెయిన్) సెమీస్‌కు దూసుకెళ్లింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన స్పెయిన్‌వీరుడు రఫెల్ నాదల్ క్వార్టర్స్‌కు చేరాడు. 
 
అలాగే, 23వ సీడ్ వావ్రింకాతో ప్రిక్వార్టర్స్‌లో గాయం కారణంగా డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ మ్యాచ్ పూర్తికాకుండానే వైదొలిగాడు. టోర్నీ రెండో రౌండ్ నుంచే భుజం గాయంతో బాధపడుతున్న జొకో ఈ మ్యాచ్‌లో 4-6, 5-7, 1-2తో వెనుకబడి ఉన్న తరుణంలో ఇక ఆట సాధ్యం కాదంటూ తప్పుకున్నాడు. దీంతో వావ్రింకా క్వార్టర్స్‌లో ప్రవేశించాడు.