బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (11:00 IST)

ఫిఫా ప్రపంచ కప్‌.. క్లబ్ నుంచి రొనాల్డో అవుట్

ronaldo
ఫిఫా ప్రపంచ కప్‌కు రంగం సిద్ధం అవుతున్న వేళ ఫుట్ బాల్ క్రీడాభిమానులకు చేదువార్త ఒకటి వచ్చింది. పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నట్లు మాంచెస్టర్ యునైటెడ్ తొలగించింది. 
 
ఇందుకు కారణంగా క్లబ్‌పై ఓ ఇంటర్వ్యూలో రొనాల్డో మాట్లాడిన మాటలే కారణమని తెలుస్తోంది. మేనేజర్‌కు రొనాల్డోకు పడలేదని.. అందుకే పరస్పర అంగీకారంతో క్రిస్టియానో రోనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు దూరమైనట్లు మాంచెస్టర్ యునైటెడ్ ప్రకటించింది. 
 
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో రొనాల్డో ఇచ్చిన రెండు స్పెల్స్‌కి ధన్యవాదాలు తెలిపింది. క్రిస్టియానో ఈ క్లబ్ తరపున 346 గేమ్స్ ఆడగా.. 145 గోల్స్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాడు.