1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (12:49 IST)

హైదరాబాద్ నాకు హోం టౌన్ లాంటిది.. సినిమాల్లోకి రాకపోయివుంటే ఒలింపిక్స్‌ల్లో ఆడేదాన్ని!

హైదరాబాద్ తనకు హోమ్ టౌన్ లాంటిదని.. హైదరాబాద్ చారిత్రక కట్టడాలతో ఆకట్టుకునే అందమైన నగరమని, శంషాబాద్ విమానాశ్రయం బాగుందని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే వెల్లడించింది. ఇంకా సినిమాల్లోకి రాకపోయి వుంటే

హైదరాబాద్ తనకు హోమ్ టౌన్ లాంటిదని.. హైదరాబాద్ చారిత్రక కట్టడాలతో ఆకట్టుకునే అందమైన నగరమని, శంషాబాద్ విమానాశ్రయం బాగుందని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే వెల్లడించింది. ఇంకా సినిమాల్లోకి రాకపోయి వుంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనే దాన్నేమోనని దీపికా వెల్లడించింది.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన దీపికా పదుకునే.. బ్యాడ్మింటన్ క్రీడాకారులే కాకుండా శుక్రవారం నుంచి రియోలో ప్రారంభం అయిన ఒలింపిక్స్‌ బరిలోకి దిగనున్న భారత ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపింది. అంతేగాకుండా రియోలో పాల్గొనే క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
 
ఒకవేళ తాను బ్యాడ్మింటన్‌లో కొనసాగి వుంటే జాతీయ జట్టుకు ఎంపికై వుంటే.. తప్పకుండా జాతి కోసం ఒలింపిక్స్‌లో ఆడేదాన్నని చెప్పుకొచ్చింది. సినిమా నటులు ఆస్కార్‌ అవార్డు అందుకోవాలని ఆశించడం ఎంత సహజమో.. క్రీడాకారులు ఒలింపిక్స్‌‌లో సత్తా చాటాలని కోరుకోవడం అంతే సహజమని చెప్పుకొచ్చింది. తాను టీనేజ్ వరకు బ్యాడ్మింటన్ క్రీడను ఆడానని దీపికా పదుకునే వెల్లడించింది.