ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బెర్నార్డో రిబోరో మృతి.. అనారోగ్యంతో..!
బ్రెజిల్ ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్‌కు చెందిన బెర్నార్డో రిబోరో (26) అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగంగా ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్‌కు చెందిన బెర్నార్డో రిబిరో (26) తొలుత స్టేడియంలో తీవ్ర అస్వస్థతకు లోనైన రిబిరోను స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం రెక్రియోలోని ఆస్పత్రికి తరలించినా అతని పరిస్థితి విషమంగా మారడంతో శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటనపై ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అల్బానియా జట్టుకు తొలుత ప్రాతినిధ్యం ఇవ్వడంతో అతని ఫుట్ బాల్ కెరీర్ ప్రారంభమైంది.