1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 జూన్ 2016 (10:38 IST)

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్ : 36 సంవత్సరాల తర్వాత కొత్త రికార్డు

భారత పురుషుల హాకీ జట్టు తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పురుషుల హాకీ జట్టు తన పవరేంటో చూపించింది. ఈ టోర్నీ ప్రారంభించిన 36 సంవత్సరాల తర్వాత ఫైనల్లోకి అర్హత సాధించి రికార్డుకెక్కింది. ఈ టోర్నీలో ఎలాగైనా ఫైనల్స్‌లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పొంది ఫైనల్స్ ఆశలను నీరుగార్చింది. 
 
కానీ శుక్రవారం జరిగిన రౌండ్ రాబిన్ చివరి మ్యాచ్‌లో బ్రిటన్, బెల్జియం జట్ల పోరు డ్రా అయింది. దీంతో భారతజట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. భారత్‌పై విజయంతో ఆస్ట్రేలియా జట్టు 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఏడుపాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. బెల్జియం 4 పాయింట్లు, బ్రిటన్ 5 పాయింట్లు సాధించాయి. బ్రిటన్, బెల్జియంల కన్నా పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న టీమిండియా తుదిపోరుకు రెడీ అయ్యింది.