1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (17:47 IST)

భారత జవాన్లపై దాడి.. బాక్సర్ విజేందర్ ఘాటు వ్యాఖ్యలు.. ట్విట్టర్లో ఫైర్

భారత పాపులర్ బాక్సర్ విజేందర్ జమ్మూకాశ్మీర్ టెర్రరిస్టుల దాడిపట్ల మండిపడ్డారు. ఆదివారం భారత జవాన్లపై సడెన్‌గా జరిగిన ఉగ్రదాడిపట్ల పలువురు ప్రముఖులు షాక్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌, బారాముల్లలోని యూరీ

భారత పాపులర్ బాక్సర్ విజేందర్ జమ్మూకాశ్మీర్ టెర్రరిస్టుల దాడిపట్ల మండిపడ్డారు. ఆదివారం భారత జవాన్లపై సడెన్‌గా జరిగిన ఉగ్రదాడిపట్ల పలువురు ప్రముఖులు షాక్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌, బారాముల్లలోని యూరీ సెక్టార్‌లోగల ఆర్మీ కార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలపాటు కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది సైనికులు అ
మరులయ్యారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. 
 
భారత ఫేమస్ బాక్సర్ విజేందర్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. 17 మంది జవాన్లు చనిపోవడం చాలా విచారకరమైన వార్త అని తెలిపాడు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఒకవేళ పాక్ యుద్ధమే కావాలని కోరుకుంటే అదే చేద్దామని, అందుకు సిద్ధమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.