శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (14:24 IST)

రిటైర్మెంట్ ప్రకటించిన సోమదేవ్ దేవ్‌వర్మన్..

భారత టెన్నిస్ క్రీడాకారుడు సోమదేవ్ దేవ్‌వర్మన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రొఫెనషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దశాబ్ద కాలంగా భారత టెన్నిస్‌కు పలు విజయాలను అందించాడు. ముఖ్యంగా సింగిల్స్‌లో సో

భారత టెన్నిస్ క్రీడాకారుడు సోమదేవ్ దేవ్‌వర్మన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రొఫెనషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దశాబ్ద కాలంగా భారత టెన్నిస్‌కు పలు విజయాలను అందించాడు. ముఖ్యంగా సింగిల్స్‌లో సోమ్‌దేవ్‌ చక్కగా రాణించాడు. సుమారు రెండేళ్ల కిందట ఎస్‌ఎస్‌ఏ ఎఫ్‌10 ఫ్యూచర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సెబాస్టియన్‌ ఫెన్సిలో చేతిలో 3-6, 2-6 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.
 
2008లో జరిగిన డేవిస్‌కప్‌ సింగిల్స్‌లో భారత్‌ తరపున తొలిసారి పాల్గొన్నాడు. ఆ తర్వాత పలు టోర్నీలో అద్భుతంగా రాణించి భారత్‌కు విజయాలను తెచ్చిపెట్టాడు. ముఖ్యంగా 2015-14లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2009 చెన్నై ఓపెన్‌, 2011 దక్షిణాఫ్రికా ఓపెన్‌ సిరీస్‌ల్లో సింగిల్స్‌ విభాగంలో ఏటీపీ టైటిల్‌కు దగ్గరకు వచ్చిన ఒకే ఒక భారతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు సోమ్‌దేవ్‌ కావడం గమనార్హం.