ప్రపంచ కప్ కబడ్డీలో భారత్ అదుర్స్: ఇంగ్లండ్‌పై ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో భారత్ తన సత్తా చాటుకుంటోంది. ఇంగ్లండ్‌పై ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 69-18తో ఘన విజయం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో
ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో భారత్ తన సత్తా చాటుకుంటోంది. ఇంగ్లండ్‌పై ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 69-18తో ఘన విజయం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ధీటుగా రాణించింది. ఈ విజయంతో పూల్-ఏ నుంచి సెమీ ఫైనల్ చేరిన రెండో జట్టుగా అనూప్‌కుమార్ సేన రికార్డు సృష్టించింది.
ఇప్పటికే భారత కబడ్డీ జట్టు ఐదు మ్యాచ్‌లాడి నాలుగింట్లో విజయం సాధించి 21 పాయింట్లతో గ్రూప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచింది. దీంతో టోర్నీలో మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్న బంగ్లాదేశ్ ఆశలు ఆవిరయ్యాయి. కొరియా ఆడిన 5 లీగ్ మ్యాచుల్లోనూ గెలిచి 25 పాయింట్లతో తొలుత సెమీస్ చేరింది.
మరో గ్రూప్ నుంచి రన్నరప్ ఇరాన్ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. బుధవారం జపాన్, థాయ్‌లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో లేదా ఇరాన్‌తో భారత్ సెమీస్‌లో తలపడనుంది.