మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:00 IST)

నర్సింగ్ యాదవ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చిన నాడా.. రియోకు రైట్.. రైట్

భారత యువ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించింది. డోప్‌ టెస్టులో పట్టుబడి యావత భారతం ముందు దోషిగా న

భారత యువ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించింది. డోప్‌ టెస్టులో పట్టుబడి యావత భారతం ముందు దోషిగా నిలబడిన నర్సింగ్‌ యాదవ్‌ ఇప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు. నిషిద్ధ ఉత్ర్పేరకాలు వాడిన కేసులో విచారణ ఎదుర్కొన్న నర్సింగ్‌.. తనపై పడిన మచ్చను చెరిపేసుకున్నాడు. 
 
నర్సింగ్‌పై కుట్ర జరిగిందని నిర్ధారించిన జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ.. అతను ఉద్దేశపూర్వకంగా ఏ తప్పూ చేయలేదని నమ్మింది. విద్రోహ చర్య వల్ల డోపింగ్‌ కూపంలో ఇరుక్కున్నాడే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎలాంటి నేరానికీ పాల్పడలేదు కాబట్టి అతడు నిర్దోషి అని తేల్చింది. దీంతో గత కొద్ది రోజులుగా నర్సింగ్‌ వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. 
 
గతవారంలో మూడు రోజులు నర్సింగ్‌ న్యాయవాదులతోపాటు నాడా లీగల్‌ టీమ్‌ వాదనలు విన్న జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ ఈ కేసులో తుది తీర్పును సోమవారం వెల్లడించింది. నాడా డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌.. డోపింగ్‌ కేసులో నర్సింగ్‌కు క్లీన్‌చిట్‌ ఇస్తున్నట్టు చెప్పారు.