1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (10:40 IST)

షాక్.. రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌‌పై నాలుగేళ్ల నిషేధం

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌‌కు షాక్ తగిలింది. రియో ఒలింపిక్స్ ఆశలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌‌కు షాక్ తగిలింది. రియో ఒలింపిక్స్ ఆశలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చివరి నిమిషంలో ఒలింపిక్స్ క్రీడల నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. 
 
నిజానికి శుక్రవారం జరగాల్సిన పురుషుల 74 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో అతడు బరిలో దిగాల్సివుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ రెజ్లర్ జలీమ్ ఖాన్‌తో నర్సింగ్ పోటీపడాల్సివుంది. అయితే, డోపింగ్‌లో 'నాడా' ఇచ్చిన క్లీన్ చీట్‌ను సీఏఎస్‌లో 'వాడా' సవాల్ చేసింది. 
 
కుట్ర కారణంగానే అతడు డోపింగ్‌లో ఇరుక్కున్నాడన్న వాదనను సీఏఎస్ అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్‌పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు సీఏఎస్ పేర్కొంది.