మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (18:26 IST)

పారిస్ పారాలింపిక్స్ పోటీలు : స్ప్రింటర్ ప్రీతి పాల్‌కు కాంస్యం

preethi paul
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌ పోటీల్లో భారత్‌కు మరో పతకం లభించింది. స్ప్రింటర్‌ ప్రీతి పాల్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100మీ. టీ35 విభాగం ఫైనల్‌లో ఆమె మూడో స్థానం దక్కించుకుంది. 14.21 సెకన్లలో తన రేసును ముగించారు. చైనాకు చెందిన అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించిన ప్రీతిపాల్.. ఆమె పుట్టినప్పుడే శారీరక సమస్యలు ఎదుర్కొంది. కాళ్లలో సత్తువ కోసం పలు చికిత్సలు చేయించుకుంటోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా పారాలింపిక్స్ పోటీల్లో తన సత్తా చాటి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 
 
పారిస్ పారాలింపిక్స్ పోటీలు : షూటింగ్‌లో బంగారు పతకం 
 
పారిస్ వేదికగా పారాలింపిక్స్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. షూటింగ్‌‍లో బంగారు పతకం గెలుచుకోగా, ఇతర విభాగాల్లో కూడా కాంస్య విగ్రహం వరించింది. 
 
పారాలింపిక్స్ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్‌ 1లో బంగారు పతకం సాధించింది. దాంతో రెండో రోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్టయింది. ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కూడా తలపడింది. ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
ఇదిలావుంటే, టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో పసిడి పతకం గెలిచిన 22 యేళ్ళ రాజస్థాన్ అమ్మాయి అవని... 50 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ త్రీ పొషిజన్స్‌లో కాంస్యం నెగ్గిన సంగతి తెల్సిందే. ఇపుడు పారిస్ పారాలింపిక్స్‌లోనూ అదే జోరు కొనసాగించి, పసిడి పతకం ఒడిసి పట్టుకున్నారు.