గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (12:12 IST)

పెళ్లి పీటలెక్కనున్న నీరజ్ చోప్రా - మను బాకర్? (Video)

manu - neraj
పారిస్ ఒలింపిక్స్ ఇండియన్ స్టార్లు నీరజ్ చోప్రా - మను బాకర్ ప్రేమలో పడ్డారా? వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారా? ఇపుడీ వార్త తెగ వైరల్ అవుతుంది. సోమవారం వీర్దరూ సన్నిహితంగా ఉండి మాట్లాడుకుంటున్న దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 
 
నీరజ్ చోప్రా, మను బాకర్ ఇద్దరూ సిగ్గులు పోతూ మాట్లాడటం దీనికితోడు మను తల్లి నీరజ్‌తో మాట్లాడుతూ అతడి చేతిని తన తనపై పెట్టుకుని ఒట్టు తీసుకున్నట్టుగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుంది. 
 
మను, నీరజ్ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కుతారని కూడా వార్తలు వస్తున్నాయి. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటూ స్వయంగా మను తల్లే కోరినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే, ఈ వార్తలపై అటు నీరజ్ కానీ, ఇటు మను గానీ ఇప్పటివరకు స్పందించలేదు.