గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (14:08 IST)

నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే.. రిషబ్ పంత్ క్యాష్ రివార్డ్ ఇస్తాడట!

neeraj chopra
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకోగా, భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో గట్టి వాగ్ధానం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 89.34 మీటర్ల ప్రయత్నంతో ఒలింపిక్ టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించాడు. 
 
క్వాలిఫైయర్‌లో నీరజ్ త్రో మెరుగ్గా ఫైనల్‌లోకి నేరుగా ప్రవేశించాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ సందర్భంగా గురువారం ఒలింపిక్స్‌లో నీరజ్ వరుసగా రెండో స్వర్ణం గెలుచుకుంటే క్యాష్ రివార్డ్ ఇస్తానని భారత క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు. 
 
ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిస్తే... రూ.1,00,089 ఇస్తానని వాగ్దానం చేశాడు రిషబ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.