మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (17:27 IST)

పారిస్ పారాలింపిక్స్ పోటీలు : షూటింగ్‌లో బంగారు పతకం

avani lekhara
పారిస్ వేదికగా పారాలింపిక్స్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. షూటింగ్‌‍లో బంగారు పతకం గెలుచుకోగా, ఇతర విభాగాల్లో కూడా కాంస్య విగ్రహం వరించింది. 
 
పారాలింపిక్స్ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్‌ 1లో బంగారు పతకం సాధించింది. దాంతో రెండో రోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్టయింది. ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కూడా తలపడింది. ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
ఇదిలావుంటే, టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో పసిడి పతకం గెలిచిన 22 యేళ్ళ రాజస్థాన్ అమ్మాయి అవని... 50 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ త్రీ పొషిజన్స్‌లో కాంస్యం నెగ్గిన సంగతి తెల్సిందే. ఇపుడు పారిస్ పారాలింపిక్స్‌లోనూ అదే జోరు కొనసాగించి, పసిడి పతకం ఒడిసి పట్టుకున్నారు.