ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే అందుకు కారణం కోచ్ గోపీచంద్ : పీవీ సింధు
ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే అందుకు కారణం కోచ్ గోపీచంద్ కారణం అని రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఒలింపిక్స్‌లో తాను సాధించిన వెండి పతకం కోచ్, తల్లిదండ్రులకు అంకితం ఇస్
ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే అందుకు కారణం కోచ్ గోపీచంద్ కారణం అని రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఒలింపిక్స్‌లో తాను సాధించిన వెండి పతకం కోచ్, తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం రాత్రి స్పెయిన్ క్రీడాకారిణి కరోలిన్ మరిన్‌తో ఫైనల్ మ్యాచ్ ముగిశాక సింధు మీడియాతో మాట్లాడింది.
ఒలింపిక్స్ కోసం నేను చాలా కష్టపడ్డాను. నాతో సమానంగా ఆయన కూడా శ్రమించారు. నా మెడల్‌ను కోచ్, నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. నా మ్యాచ్‌లు ఆలస్యంగా జరిగినప్పటికీ ఒపిగ్గా వీక్షించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి అండదండలే నాకు ఆలంబనగా నిలిచాయని అన్నారు.
అలాగే, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ వారం నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ వారంలోనే వెండి పతకం సాధించాను. కరోలినా కూడా బాగా ఆడింది. ఫైనల్లో ఇద్దరం హోరాహోరీగా తలపడ్డాం. కానీ ఈరోజు ఆమె పైచేయి సాధించింది. మొత్తంగా చూస్తే చాలా మంచి గేమ్ ఆడాం. నాకు సిల్వర్ మెడల్ దక్కినా సంతోషంగానే ఉంది. నాకు మద్దతు తెలిపి, నా విజయం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.