1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జులై 2016 (12:53 IST)

రియో ఒలింపిక్స్‌ అథ్లెట్లకు జికా వైరస్ భయం.. కండోమ్స్ కోసం పోటాపోటీ!

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు జికా వైరస్ బెంగ పట్టుకుంది. జికా కారణంగా టాప్ గోల్ఫర్లతో పాటు స్టార్ అథ్లెట్లలో కొందరు ఇప్పటికే రియోలో ఆడలేమంటూ తప్పుకుంటున్నారు.

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు జికా వైరస్ బెంగ పట్టుకుంది. జికా కారణంగా టాప్ గోల్ఫర్లతో పాటు స్టార్ అథ్లెట్లలో కొందరు ఇప్పటికే రియోలో ఆడలేమంటూ తప్పుకుంటున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఈ వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండేందుకు మెక్సికో దేశం తమ అథ్లెట్ల కోసం యాంటీ జికా కిట్‌ను అందజేయనుంది. ఈ కిట్‌లో దోమల నివారిణి, బ్యాక్టీరియాను నిరోధించే హ్యాండ్ జెల్‌తో పాటు కండోమ్స్ ఉన్నాయి. 
 
జికా వైరస్ ప్రధానంగా ఓ రకమైన దోమకాటుతో పాటు సురక్షితం కానీ శృంగారం ద్వారా వ్యాప్తి చెందే అవకాశమున్నందునే ఈ కిట్‌లో కండోమ్స్‌ను కూడా ఉంచినట్లు మెక్సికో ప్రభుత్వం తెలిపింది.