శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (20:22 IST)

రియోలో లియాండర్ పేస్.. గది కేటాయించకుండా ఘోర అవమానం!

రియో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ రియోకు చేరుకున్నారు. అక్కడ అడుగు పెట్టగానే ఆయనకు తీవ్రమైన అవమానం జరిగింది.

రియో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ రియోకు చేరుకున్నారు. అక్కడ అడుగు పెట్టగానే ఆయనకు తీవ్రమైన అవమానం జరిగింది. ఆరుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న లియాండర్‌కు రియో ఒలింపిక్స్ నిర్వహణాధికారులు క్రీడా గ్రామంలో గదిని కేటాయించలేదు. దీంతో మరో ఆటగాడితో కలిసి గదిని షేర్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 
 
దీనిపై లియాండర్ స్పందిస్తూ... ఆరుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తనకు రూమ్ కేటాయించకపోవడం ఎంతో బాధగా ఉందన్నాడు. అయితే తాను న్యూయార్క్‌లో వరల్డ్ టెన్నీస్ టోర్నీలో పాల్గొనడం వల్లనే మిగతా వాళ్లతో కలిసి రాలేకపోయానని వివరించాడు. మొత్తం మూడు గదులు కేటాయించారని, ఒక దానిలో కోచ్ జిఫాన్ అలీ, మిగితా వాటిలో మరో టెన్నీస్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఫిజియోథెరపిస్టు ఉన్నారని చెప్పాడు పేస్. దీంతో పేస్ రాకేశ్ గుప్తా గదిని వాడుకుంటున్నాడు.