శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (08:43 IST)

గర్భవతి సానియా మీర్జా ఏం చేసిందో తెలుసా?

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతి మహిళ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను గర్భవతిని అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా యోగాసనాలు వేసి ప్రతి ఒక్కరినీ

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతి మహిళ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను గర్భవతిని అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా యోగాసనాలు వేసి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమె మరోమారు వార్తల్లోకెక్కారు.
 
దీనిపై సానియా స్పందిస్తూ, 'అంతర్జాతీయ యోగా దినోత్సవం అయినా లేదా ఏ రోజైనా గర్భధారణ సమయంలోనూ నేను యోగా వీడలేదు... నా మార్గం యోగా' అంటూ తాను యోగా చేస్తున్న ఫోటోతో సహా ట్విట్టర్‌లో పెట్టారు. 
 
దీనిపై కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. 'వండర్‌ఫుల్ సానియా... గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల ఫిట్‌గా ఉంటారు' అంటూ ప్రశంసించారు. గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని మనేకాగాంధీ వ్యాఖ్యానించారు.