శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (13:04 IST)

బెంగళూరు ట్రాఫిక్ చెత్తచెత్తగా... గుర్రమెక్కేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏం చేశాడో తెలుసా?

ట్రాఫిక్ జామ్. ఈ మాట, ఈ బాధ అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటే ఇక ఎప్పటికి గమ్యాన్ని చేరుకుంటామో కూడా తెలియని పరిస్థితి. మెట్రో నగరాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. హైదరాబాదులో అయితే ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి వరకూ ట్రాఫిక్ జ

ట్రాఫిక్ జామ్. ఈ మాట, ఈ బాధ అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటే ఇక ఎప్పటికి గమ్యాన్ని చేరుకుంటామో కూడా తెలియని పరిస్థితి. మెట్రో నగరాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. హైదరాబాదులో అయితే ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి వరకూ ట్రాఫిక్ జామ్ అవుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో అర్థమవుతుంది. 
 
ఇలాంటి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని నానా కష్టాలు పడిన రాజస్థాన్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరులో ఓ పని చేశాడు. అదేంటయా అంటే... ఓ తెల్లటి గుర్రమెక్కి తన ఆఫీసుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. చక్కగా ఇన్ చేసుకుని భుజానికి బ్యాగు తగిలించుకుని చక్కగా గుర్రమెక్కి ఆఫీసు ముందు దిగాడు. ఇతడి పేరు రూపేశ్ కుమార్. గుర్రంపైన ఇలా ఎందుకు వచ్చావని అడిగితే... సిటీ ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోందని చెప్పుకొచ్చాడు. ఈ ట్రాఫిక్ పైన తన నిరసనను తెలిపేందుకే ఈ వినూత్న ఆలోచన చేసినట్లు వెల్లడించాడు. 
 
అంతేకాదు... గుర్రంపైన ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నా చివరి పనిరోజు’ అనే బోర్డు కూడా తగిలించాడు. ఇది విచిత్రంగానూ అనిపించింది. దానిపై ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో తను ఏ కంపెనీలోనూ ఉద్యోగం చేయబోనని తెలిపాడు. త్వరలోనే సొంత సంస్థను ప్రారంభిస్తానని చెప్పాడు. మొత్తమ్మీద ఇతడి ఫోటోలు ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యాయి.