శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (19:07 IST)

ఎస్ఐ‌ఎస్‌సీఏ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్

sneha nair
సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ (ఎస్ఐఎస్‌సీఏ) గౌరవ అధ్యక్షురాలిగా స్నేహా నాయర్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్కూల్స్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.సి.ఎఫ్.ఐ) ఫౌండర్, జనరల్ సెక్రటరీ పి.బి.సునీల్ కుమార్ శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఎస్.సి.ఎఫ్.ఐ గుర్తింపు పొందిన సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. 
 
ఇది ఆమె సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి గర్వకారణమని, ఎందుకంటే ఆమె ఎన్నో ఇతర శక్తివంతమైన ప్రొఫైల్‌లలో ఎన్నికైంది. ఈ నియామకంపై రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ప్రశంలు కురిపిస్తున్నారు. 
 
కాగా, సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలిగా స్నేహ నాయర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జూన్ 26వ తేదీ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు ప్రముఖులు హాజరుకానున్నారు.