గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:01 IST)

పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకం.. షూటింగ్‌లో కాంస్యం

Singhraj Adana
పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన షూటింగ్‌లో సింఘ్‌రాజ్ అధానా కాంస్య పతకం గెలిచాడు. అతను పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్ 1 కేటగిరీలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 
 
తాజా పతకంతో భారత్ ఇప్పటి వరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో రెండు గోల్డ్‌, నాలుగు సిల్వర్‌, మరో రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. భారత్ తరపున పాల్గొన్న మరో షూటర్ మనీశ్ నర్వాల్ ఫైనల్స్లో ఏడో స్థానంలో నిలిచాడు.