బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (10:48 IST)

అమెరికాలో భారత అథ్లెట్ అరెస్టు... ఎందుకో తెలుసా?

అమెరికాకు వెళ్లిన భారత అథ్లెట్ అరెస్టు అయ్యాడు. అదీ అత్యాచారం కేసులో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

అమెరికాకు వెళ్లిన భారత అథ్లెట్ అరెస్టు అయ్యాడు. అదీ అత్యాచారం కేసులో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత నెల 23 నుంచి 25 వరకూ ప్రపంచ స్నో షూ చాంపియన్ షిప్ పోటీలు జరుగగా, భారత అథ్లెట్ తన్వీర్ హుస్సేన్ పాల్గొన్నాడు. ఆయనపై న్యూయార్క్ రాష్ట్రంలోని సారనాక లేక్ విలేజ్‌లో 12 సంవత్సరాల బాలికను రేప్ చేసినట్టు ఆదే పోలీసులు అభియోగాలను నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
దీనిపై స్నో షూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు స్పందిస్తూ... తన్వీర్ అరెస్టు వాస్తవమని, ఏం జరిగిందన్నది తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. కాగా, తను నేరం చేయలేదని హుస్సేన్ చెపుతున్నారు.