ఉస్సేన్ బోల్ట్ గొడ్డు మాంసంతో పాటు.. ఇంకా ఏం తింటాడంటే...
జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ గొడ్డు మాంసం ఆరగించడం వల్లే రియో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు కొల్లగొట్టాడంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది
జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ గొడ్డు మాంసం ఆరగించడం వల్లే రియో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు కొల్లగొట్టాడంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో ఉస్సేన్ బోల్ట్ తీసుకునే ఆహారంపై పలువురు నెటిజన్లు ఆరా తీయారు.
వాస్తవానికి బోల్ట్ ఎలాంటి ఆహారం తీసుకుంటాడన్న దానిపై వివరాలు ఆరాతీయగా... ఉదయం ఎగ్ శాండ్విచ్... మధ్యాహ్నం పాస్తాతో గొడ్డు మాంసం... రాత్రి జమైకన్ కుడుములు, రోస్టెడ్ (కాల్చిన) చికెన్ బ్రెస్ట్ తీసుకుంటాడు. వీటితో పాటు.. రోజంతా పైనాపిల్, యాపిల్, మామిడి పండ్లు ఆరగిస్తూ ఉంటాడని తెలుస్తోంది.
అంతేకాకుండా, బోల్ట్ అథ్లెట్ కాకముందు జమైకన్లు తీసుకునే అన్నం, చేపలు తినేవాడని, మూడేళ్ల క్రితం డైట్‌పై శ్రద్ధ చూపిస్తుండడంతో ఏం తినాలి? ఎంత తినాలి? అన్న విషయాలపై శ్రద్ధ వహించాడు.