శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 జులై 2017 (03:53 IST)

బ్రాను కూడా వదలని వివక్ష.. వింబుల్డన్‌లో వీనస్‌ విలియమ్స్‌కి చేదు అనుభవం

వింబుల్డన్‌ నిర్వాహకులు సాంప్రదాయం పేరుతో విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని సార్లు పరిధి దాటి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, ఐదుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) కూడా తాజాగా ఈ

వింబుల్డన్‌ నిర్వాహకులు సాంప్రదాయం పేరుతో విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని సార్లు పరిధి దాటి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, ఐదుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన వీనస్‌  విలియమ్స్‌ (అమెరికా) కూడా తాజాగా ఈ బాధితుల జాబితాలో చేరింది. ఎలిస్‌ మెర్టెన్స్‌తో సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. 
 
మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఒకసారి ఆమె వేసుకున్న డ్రెస్‌లోంచి గులాబీ రంగు ‘బ్రా’ స్ట్రాప్‌ బయటకు కనిపించింది. ఈ విషయాన్ని టోర్నీ అధికారులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సెట్‌లో విరామం సమయంలో వీనస్‌ లాకర్‌ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తిరిగొచ్చిన ఆమె తెలుపు రంగు ‘బ్రా’తో బరిలోకి దిగింది. 
 
‘ఆట సమయంలో బయటకు కనిపించే లోదుస్తులు కూడా పూర్తిగా తెలుపు రంగుల్లోనే ఉండాలి. ఒకవేళ దుస్తుల చివర్లో మరో రంగు సన్నగా కనిపిస్తుంటే అది ఒక సెంటీమీటర్‌కు మించి ఉండరాదు’ అని వింబుల్డన్‌ నిబంధనలు చెబుతున్నాయి. 
 
లోదుస్తుల అంశంపై మీడియా సమావేశంలో చర్చించడం సభ్యత కాదని మ్యాచ్‌ అనంతరం వీనస్‌ దీనిపై వ్యాఖ్యానించింది.