టేస్టీ టేస్టీ క్యారెట్ పాయసం ఎలా చేయాలో చూద్దాం...

సోమవారం, 22 అక్టోబరు 2018 (11:28 IST)
క్యారెట్స్‌లోని విటమిన్స్, ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచివి. కొందరు క్యారెట్స్‌తో కూరలు, హల్వాలు, వేపుడు వంటి రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. ఇకొందరైతే క్యారెట్‌ను పచ్చిగా తీసుకుంటారు. మరి దీనితో టేస్టీ క్యారెట్స్ పాయసం ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
క్యారెట్స్ - 2
పాలు - అరలీటరు
నెయ్యి - 1 స్పూన్
చక్కెర - 4 స్పూన్స్
జీడిపప్పు - 6
బాదం పప్పు - 6
యాలకుల పొడి - కొద్దిగా
కుంకుమ పువ్వు - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా జీడిపప్పు, బాదం పప్పులను అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత బాదం పప్పులను పొట్టుతీసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్స్ తొక్కలను తీసి సన్నగా తురిమి పెట్టుకోవాలి. తరువాత కుంకుమ పువ్వును పాలలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక క్యారెట్ తురుము వేసి బాగా వేయించుకోవాలి.

మరో బాణలిలో పాలు పోసి సన్నని మంటపై ఉంచి మరిగించాలి. పాలు కాస్త చిక్కబడిన తరువాత క్యారెట్ తురుము, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి మరికాసేపు అలానే ఉంచుకుని ఆ తరువాత చక్కెర, యాలకుల పొడి వేసి కలుపుకుని చివరగా కుంకుమ పువ్వు వేసి కలిపి 2 నిమిషాల తరువాత దించేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ పాయసం రెడీ.

అన్నీ చూడండి

దారుణం, స్నానం చేస్తున్న ఏనుగుల మధ్య ఘర్షణలో చిక్కుకుని మహిళ మృతి, వీడియో

మే 22 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం విజయ్

35మంది ఉగ్రవాదులను హతమార్చిన పాకిస్తాన్ భద్రతా దళాలు

ఇంధన పొదుపు మంత్రం : 2 కిలోమీటర్లు నడిచిన సిక్కిం సీఎం తమాంగ్

మూడో బిడ్డకు 30 వేలు, నాలుగో బిడ్డకు 40 వేలు ఎటు పోతాయో? ఒక్కరికే 30 లక్షలవుతుంటే...

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments