శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (13:03 IST)

రాగుల ఉప్మా ఎలా చేయాలో చూద్దాం..

మిగిలిన పోయిన ఇడ్లీలతో, బ్రెడ్‌లతో ఉప్మాలు చేస్తుంటారు. అలానే రాగులతో కూడా ఉప్మా చేయొచ్చు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి. శరీర వేడిని తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మరి ఇటువంటి రాగులతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:
రాగి పిండి - 1 కప్పు
ఉల్లిపాయ - 1
ఆవాలు - పావు స్పూన్
మినపప్పు - పావు స్పూన్
శెనగపప్పు - అర స్పూన్
కారం - 2 స్పూన్స్
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత.

తయారీ విధానం:
ముందుగా రాగిపిండిని ఒక బౌల్‌లో తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నీరు పోసి బాగా కలుపుకుని కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, మినపప్పు, శెనగపప్పు వేసి వేయించి ఆ తరువాత రాగిపిండి, కారం వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే టేస్టీ అండ్ హెత్తీ రాగి ఉప్మా రెడీ.