చింతమడకలో ఓటేసిన సీఎం కేసీఆర్ - మధ్యాహ్నం ఒంటి గంటకు 36.68 శాతం పోలింగ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా సాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం వివరాలను పరిశీలిస్తే..
మరోవైపు, భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ తన సతీమణితో కలిసే ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లిన సీఎం.. అక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ ఆయన వెళ్లిపోయారు.
చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 20.64 శాతం పోలింగ్ మాత్రే నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు.