శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (04:31 IST)

కేసీఆర్‌కి పెద్ద ఝలక్ ఇచ్చిన చంద్రబాబు

కీలకమైన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ప్రధాని ఇచ్చిన అప్పాయింట్‌మెంట్ చివరి నిమిషంలో రద్దుకావడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందా? అవుననే అంటున్నారు ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌.

కీలకమైన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ప్రధాని ఇచ్చిన అప్పాయింట్‌మెంట్ చివరి నిమిషంలో రద్దుకావడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందా? అవుననే అంటున్నారు ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌. ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని అఖిలపక్ష బృందానికి ప్రధాని అపాయింట్‌మెంట్‌ రద్దుకావడం వెనక ఇద్దరు నాయుళ్ల కుట్ర ఉందని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రధానిని కలిసేందుకు సీఎం కేసీఆర్‌కు తొలుత అనుమతిచ్చిన పీఎంవో తర్వాత అపాయింట్‌మెంట్‌ను రద్దు చేస్తే ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 15లోగా సీఎం కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌ లభించకుంటే బీజేపీ నేతలను రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వంగపల్లి హెచ్చరించారు.
 
కీలకమైన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ప్రధానితో మాట్లాడేందుకు  తెలంగాణ  సీఎం కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్ష బృందం వెళ్తుండగా అపాయింట్‌మెంట్‌ రద్దు కావడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని అనుమానాలు ప్రబలుతున్నాయి. వర్గీకరణపై  ప్రధానిని తెలంగాణ సీఎం కలిస్తే ఏపీలో ఇరుకున పడతామనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు సూచనల మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకకుండా వెంకయ్య అడ్డుపడ్డారని తెలంగాణ నేతలు అనుమానిస్తున్నారు.

అఖిలపక్షానికి నాయకత్వం వహించేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరిస్తే సభలు, వేదికలపై బహిరంగంగా మద్దతు పలికిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర నేతలు ఎందుకు సహకరించడంలేదని వీరు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై తొలినుంచి వ్యతిరేకత తెలుపుతున్న చంద్రబాబు కేంద్రంలో తనకు అండదండగా ఉన్న వెంకయ్యతో చర్చించి ప్రధానితో కేసీఆర్ అప్పాయింట్‌మెంట్ రద్దు చేయించారని అనుమానాలు ప్రబలుతుండటంతో తెలంగాణలో మళ్లీ బాబు వ్యవహారంపై చర్చ మొదలైంది