ఆదివారం, 18 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : శనివారం, 21 ఫిబ్రవరి 2015 (15:57 IST)

అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం.. కేసీఆర్ ప్రకటన..!

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మొత్తం వెంటనే ఆయా కుటుంబాలకు అందే విధంగా చర్యలు చేపడతామని కేసీఆర్ తెలిపారు. 
 
అంతేకాకుండా వీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయంపై సదరు జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలన్న విషయంపై కుటుంబసభ్యులే నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం వద్దంటే ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని కేసీఆర్ వివరించారు.