బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (19:10 IST)

సమంతను నా దగ్గరకు పంపమన్న కేటీఆర్.. ఆమె నో చెప్పడంతో విడాకులు.. కొండా సురేఖ (video)

Samantha
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆరే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ బాపూఘాట్‌లోని గాంధీ జయంతి మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈ సంచలన ఆరోపణలు చేశారు. 
 
హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసింది కూడా కేటీఆరేనని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది కేటీఆర్‌ అని..  చాలామంది విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్‌ కారణం. మొన్నటి వరకు మంత్రి సీతక్కను ట్రోల్‌ చేశారు. ఇప్పుడు తనను చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలంటేనే కేటీఆర్‌కు చిన్నచూపు. ఒక మహిళా మంత్రిని ట్రోల్‌ చేస్తే ఖండించే సంస్కారం కేటీఆర్‌కు లేదా? అని ప్రశ్నించారు. 
 
తనపై పెట్టిన పోస్టులకు మాజీ మంత్రి హరీష్ రావు మానవతా థృక్పతంతో స్పందించారు. కేటీఆర్‌కు ఆ మాత్రం సోయి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా బీఆర్‌ఎస్‌ పార్టీలు తనపై రెచ్చిపోయి సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్నారు. 
 
దుబాయి నుంచి బీఆర్‌ఎస్ పార్టీల సోషల్‌ మీడియా నడుపుతోందని మంత్రి ఆరోపించారు. నాగ చైతన్య సమంతలు ప్రేమించి పెళ్లిచేసుకుని ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలోనే విడాకులకు ప్రధాన కారణం ఫోన్‌ ట్యాపింగ్‌ అని వినిపించాయి. 
ఈ నేపథ్యంలో సమంత- చైతూ విడాకులకు కూడా కేటీఆరే కారణమన్నారు కొండా సురేఖ. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండాలంటే.. సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని నాగార్జున వాళ్లు ఒత్తిడి చేశారు. 
 
సమంత అందుకు ఒప్పుకోలేదు. దీంతో వెళితే వెళ్లు లేదంటే లేదు అని సమంతకు విడాకులు ఇచ్చారు. దీంతో సమంత విడాకులతో వెళ్లిపోవాల్సి వచ్చిందని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు డ్రగ్స్‌ అలవాటు ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆరేనని కొండా సురేఖ అన్నారు.