శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (17:13 IST)

ఖమ్మం జిల్లాలో ఉప్పొంగిన మున్నేరు...18 మంది గ‌ల్లంతు (Video)

Munneru
Munneru
భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్భంధం అయ్యాయి. రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర నగర్ కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది.

మున్నేరు వాగు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 
 
ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోని ప‌లు న‌ది ప్ర‌వాహాల్లో 18 మంది గ‌ల్లంత‌య్యారు. ఇందులో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రిని స‌హాయ‌క బృందాలు ర‌క్షించారు. ఖమ్మం రూరల్ మండలంలో వాల్య చెరువు తెగిపోవడంతో పది మంది గల్లంతయ్యారు.