గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (16:07 IST)

అలా నడిచి వెళ్తే రోడ్డుపై బ్యాగు.. అందులో రెండు లక్షలు.. మీరేం చేస్తారు? (video)

man
man
అలా నడిచి వెళ్తే రోడ్డుపై ఏదో బ్యాగు కనిపించింది. అందులో రెండు లక్షలున్నాయని చూస్తే మీరం చేస్తారు.. కొందరైతే ఏదో దొరికిందని సైలెంట్‌గా వుండిపోతారు. మరికొందరైతే పోలీసులకు అప్పగిస్తారు. ఇలాంటి ఆసక్తికర ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరి పరిధిలోని లాలాపేట అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి నడుచుకుంటూ వెళుతుండగా ముద్దం సతీష్ యాదవ్‌ అనే వ్యక్తికి రోడ్డుపై రెండు లక్షల రూపాయలు దొరికాయి. 
 
వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిషోర్ యాదవ్‌కు సమాచారం అందించాడు. ఆపై కిషోర్ యాదవ్ సాయంతో లాలాగూడ పోలీసులకు రెండు లక్షలు అప్పగించారు. 
 
ఈ సందర్భంగా పోలీసులు సతీష్‌ను అభినందించారు. రెండు లక్షల రూపాయలు రోడ్డుపై దొరికినా నిజాయితీగా పోలీసులకు అప్పగించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.