గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (16:38 IST)

పోలీసుల వేధింపులు.. రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య అంటూ సెల్ఫీ వీడియో

Man
Man
పోలీసులు వేధిస్తున్నారని.. ఓ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. మస్తాన్ బాయ్ అనే వ్యక్తి 12 వాహనాల తాకట్టులో పోలీసులకు చిక్కాడు. వాటిలో దొంగతనం చేసిన వాహనాలు ఉండడంతో మస్తాన్ కొట్టించి తన పేరు చెప్పించాలని పోలీసులు చూస్తున్నారని యువకుడు ఆరోపణలు చేశాడు. 
 
తనకు కానిస్టేబుల్ ఫోన్ చేసి తనపై కేసులు పెడుతామని బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని కానిస్టేబుల్ బాబు బెదిరించాడని ఆరోపణలు చేశాడు. 
 
సిఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడు మదార్ వలి వాపోయాడు. డబ్బు కోసం వేధిస్తున్నందున.. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మదార్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. 
 
ఈ వీడియోను పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్‌పి, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ చేరాలని విజ్ఞప్తి చేశాడు. తన చావుకు సిఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ కారణమని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.