ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (16:36 IST)

ట్రాన్స్​జెండర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడో తెలుసా? (video)

Transgender marriage
Transgender marriage
ఓ ట్రాన్స్​జెండర్, యువకుడి ప్రేమ ఫలించింది. తన ప్రేమ కోసం ఆ యువకుడు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వారందరి సమక్షంలో ట్రాన్స్​జెండర్​ను వివాహం చేసుకున్నాడు. ధారణంగా ట్రాన్స్​జెండర్​తో పెళ్లి అంటే ఏ కుటుంబ సభ్యులైనా ఒప్పుకోరు. 
 
కానీ ఈ అబ్బాయి కుటుంబసభ్యులు మాత్రం కుమారుడి ఇష్టాన్ని గౌరవించి, అతడి మనసుకు నచ్చిన వ్యక్తి(ట్రాన్స్​జెండర్​)ని ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. ఈ పెళ్లికి జగిత్యాల జిల్లా వేడుకైంది. 
 
వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్​ గ్రామానికి చెందిన శ్రీనివాస మల్యాల, అదే మండలానికి చెందిన మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్​జెండర్​ కరుణాంజలిని వివాహం చేసుకున్నాడు. 
 
రెండేళ్ల పాటు ఈ జంట ప్రేమలో వుంది. శ్రీనివాస మల్యాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. సాధారణ వివాహం ఎలా జరుగుతుందో, వీరికీ అదే రీతిలో, అంతే ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సందర్భంగా ఊరేగింపులో ట్రాన్స్​జెండర్లు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.