బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:52 IST)

భర్తకు విడాకులు.. రాత్రంతా ప్రియుడితో గడిపింది.. తెల్లారేసరికి..?

woman
వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లలు, కుటుంబ సంబంధాలు నాశనం అవుతాయి. ఇలా ఓ అక్రమ సంబంధానికి ఓ వివాహిత బాధితురాలు అయింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగు చూసింది.
 
వివరాల్లోకి వెళితే.. వట్టెం పరిధిలోని కల్వకుంట తండాకు చెందిన గిరిజన మహిళ చిట్టెమ్మ(28) తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత బిజినేపల్లికి చెందిన శివ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. 
 
ఆదివారం శివ వట్టెం గ్రామంలోని పొలానికి రావాలని చిట్టెమ్మను పిలిచి ఆదివారం రాత్రి అక్కడే గడిపాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ, దాడిలో చిట్టెమ్మ మృతి చెందింది. 
 
దీంతో భయపడిన శివ అక్కడ పడి ఉన్న చెత్తలో ఆమె మృతదేహాన్ని కప్పి పెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.