ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (19:01 IST)

ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కిన జాన్వీ కపూర్...

jhanvi kapoor
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. తన మొదటి చిత్రంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న జాన్వీ.. తాజాగా రామ్ చరణ్ నటించే 16వ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హాజరై తొలి క్లాప్ కొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, జాన్వీ కపూర్‌కు శ్రీవారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీన కూడా జాన్వీ తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తన స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇలా స్వామి వారి సేవలో పాల్గొన్న సమయంలో తీసిన ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో తన తిరుమల యాత్ర ఎలా జరిగిందో ఆమె వివరించారు. చెన్నైలోని జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో మూడు గంటల ప్రయాణం తర్వాత తిరుమలకు చేరుకున్నట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత జాన్వీ కపూర్ తన బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపింది. ఈ క్రమంలో మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ - తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి మోకాళ్లపై మెట్లెక్కారు. దాదాపు 50 సార్లు తాను ఇక్కడకు వచ్చినట్టు తెలియజేశారు. ఈ దేవాలయం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు.