మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (18:57 IST)

రామ్ చరణ్, జాన్వీకపూర్ చిత్రం రేపు లాంఛనంగా ప్రారంభం

RC 16 pooja poster
RC 16 pooja poster
రామ్ చరణ్ 16 వ చిత్రం బుధవారంనాడు ఏకాదశినాడు ప్రారంభం కానుంది. మొదటినుంచి అనుకుంటున్నట్లుగా మార్చి 20 న సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభిస్తున్నారు. ఇంకా వారంరోజుల్లో చరణ్ పుట్టినరోజు వుండగా ఈ సినిమాప్రారంభం కావడం విశేషం. మరోవైపు చరణ్ అభిమానులు పలు సేవాకార్యక్రమాలు పలు చోట్ల నిర్వర్తిస్తున్నారు.
 
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ శుభసూచకంగా ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. పూజా వేడుక రేపు ఉదయం 10.10 గంటలకు గుడిలోప్రారంభం కానున్నదని తెలుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే ఉత్తరాంధ్రలో నటీనటుల కోసం ఆడిషన్ నిర్వహించి ఎంపిక చేశారు. ఉప్పెన తర్వాత అతని టేకింగ్ నచ్చి రామ్ చరణ్ డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత అతను చెప్పిన కథ నచ్చడంతో సెట్ పైకి వెళ్ళనుంది. 
 
ఇక ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. వృద్ధిసినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.