మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మార్చి 2024 (11:25 IST)

#JanhviKapoor పుట్టినరోజు #RC16 స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

Jhanvi Kapoor
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా పేరు తెచ్చుకుని ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌పై శ్రీదేవి అభిమానుల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. శ్రీదేవి మార్చి7, 1997న ముంబైలో జాన్వీకి జన్మనిచ్చింది. జాన్వీ పుట్టిన తర్వాతే, బోనీ శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. శ్రీదేవితో బోనీ సంబంధం అప్పట్లో వివాదానికి కేంద్రంగా మారింది. 
 
జాన్వీ తన ప్రారంభ పాఠశాల విద్యను ముంబైలోని "ధీరూభాయ్ అంబానీ స్కూల్"లో ముగించింది.  లాస్ ఏంజిల్స్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకోవడానికి అమెరికాకి వెళ్లింది.
 
పుట్టిన తేదీ- మార్చి 06, 1997
వయస్సు- 25 సంవత్సరాలు
రోజు- గురువారం
స్వస్థలం- ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
థియేటర్ అండ్ ఫిల్మ్‌లలో విద్యా అర్హత కోర్సు
హై స్కూల్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్
బరువు- 55 కిలోలు
 
శరీర కొలత- 32-26-32
 
కాలేజ్ ది లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, లాస్ ఏంజిల్స్, అమెరికా 
రాశిచక్రం -మీనం
 
జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఆమె తండ్రి, బోనీ కపూర్, నిర్మాత. ఆమె చెల్లెలు ఖుషీ కపూర్. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, దిలీప్ కుమార్ జాన్వీ కపూర్ అభిమాన నటులు. కరీనా కపూర్, వహీదా రెహ్మాన్, నూతన్, మధుబాల నచ్చిన  నటీమణులు. ఆమె అభిరుచులలో సంగీతం వినడం, ప్రయాణం చేయడం వంటివి ఉన్నాయి.
 
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో మూవీకి జాన్వీ సైన్ చేసింది. జాన్వీ పుట్టినరోజు సందర్భంగా RC16 మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. 
 
రామ్ చరణ్-బుచ్చి బాబు కాంబోలో వస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా తెలిపింది. దీని కోసం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "హ్యాపీ బర్త్ డే జాన్వీ కపూర్.. మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నా" అంటూ డైరెక్టర్ బుచ్చి బాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.