ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (18:08 IST)

బీఆర్ఎస్ బాగా రిచ్ గురూ.. ఆ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు.. వామ్మో! (video)

BRS
BRS
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయినా.. దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన పార్టీగా మాత్రం అదరగొట్టేసింది. తెలంగాణలో బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్నప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆ పార్టీకి ప్రస్తుతం బంపర్ కొట్టినంత పనైంది. ఎలా అంటే.. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్ పార్టీనే టాప్‌లో నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల కంటే.. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లోనే ఎక్కువ డబ్బులు వున్నాయి. 
 
2024 లోక్‌సభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఆడిట్‌ నివేదికను సమర్పించగా.. దాన్ని ఎలక్షన్ కమిషన్ తాజాగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో ఏకంగా.. రూ.1,500 కోట్లు ఉండటం గమనార్హం.
 
లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్ అకౌంట్‌లో రూ.1,519 కోట్లు ఉండగా.. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ముగిసేలోపు బీఆర్ఎస్ పార్టీకి రూ.47.56 కోట్ల విరాళాలు వచ్చి చేరాయి. అయితే.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో పాటు ఇతర కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. 
 
వివిధ రకాల మాధ్యమాల్లో ప్రచారానికి రూ.10.51 కోట్లు ఖర్చుచేయగా.. ప్రచార సామాగ్రికి రూ.34.68 కోట్లు, బహిరంగసభలు, ఊరేగింపులు, ర్యాలీలకు రూ.20.37 కోట్లు, ఇతర ప్రచారానికి రూ.34.39 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదికలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
 
ఇదిలా ఉంటే.. ఇతర ప్రాంతీయ పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే ఖాతాలో రూ.338 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ అకౌంట్‌లో రూ.340 కోట్లు, తెలుగుదేశం పార్టీ ఖాతాలో రూ.272 కోట్లు, జేడీయూకు రూ.147 కోట్లు ఉండగా.. వైసీపీ ఖాతాలో మాత్రం కేవటం రూ.27 కోట్లు మాత్రమే ఉన్నట్లు నివేదికలో వెల్లడి అయ్యింది.