బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (20:32 IST)

24-11-2004 నుంచి 30-11-2024 వరకు మీ వార ఫలితాలు

Astology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అదృష్టయోగం ఉంది. ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. ఆదివారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. సంతానానికి శుభం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు ఆందోళన అధికం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మంగళవారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆర్భాటాలకు వివపీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధువులు రాక ఇబ్బంది కలిగిస్తుంది. బుధ, గురు వారాల్లో పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. సన్నిహితుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం కలిసివచ్చే సమయం. పట్టుదలతో యత్నాలు సాగించండి. చేస్తున్న పనులు మధ్యలో అపివేయవద్దు. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొన్ని వ్యవహారాలు అనుకూల ఫలితాలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. చిన్న చిన్న చికాకులుంటాయి, ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పనుల ప్రారంభంలో అటంకాలెదురవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పట్టుదలతో ముందుకు సాగండి. లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. దంపతుల మధ్య సఖ్యతలోపం, చీటికిమాటికి అసహనం చెందుతారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయాన్ని రాబట్టేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. గృహ అలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. మరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. లావాదేవీలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. డబ్బుకు లోటుండదు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభాం ముఖ్యం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మంగళవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వనసమారాధనల్లో పాల్గొంటారు. పాతపరిచయస్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి ఉద్యోగయోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ద్విచక్రవాహనదారులకు దూకుడు తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించి భంగపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం పొందుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తివుతాయి. బంధువులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. గురువారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. హోల్సేలా వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.