గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (23:04 IST)

17-11-2024 నుంచి 23-11-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. మీ కృషి ఫలిస్తుంది. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను దక్కించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. బంధువులతో తరచుగా సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సన్నిహితులు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులో ఊహించని ఫలితాలుంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది, ప్రియతములతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామికంగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. బుధవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానానికి శుభయోగం. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. మీ జోక్యం అనివార్యం. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఎదురవుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి, ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మన మంచికేనని భావించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. పనులు సానుకూలమవుతాయి. సంస్థలు, పరిశ్రమల స్థాపనలపై దృష్టి పెడతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహిండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులు కలిసిరావు. ముఖ్యమైన పనుల్లో అలక్ష్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే. అనుకూలం. ఉద్యోగస్తులకు పదవీయోగం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు. గురువారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వేడుకలు, వనసమారాధనల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పరిచయస్తులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలకు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంతానానికి ఉద్యోగయోగం. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. సంకల్పబలంతోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఆహ్వానం అందుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంద్రింపులు జరుపుతారు. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. గృహమరమ్మతులు చేపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రయాణంలో కొత్త వారితో జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సంస్థలు, పరిశ్రమల స్థాపనకు అనుకూలం. పనులు వేగవంతమవుతాయి. బుధవారం నాడు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివేసి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సంద్రింపులు పురోగతిన సాగుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. శుక్ర, శనివారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సంతానానికి శుభయోగం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు ఊహించని సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వనసమారాధనలో పాల్గొంటారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.