ఆదివారం, 27 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (20:53 IST)

27-10- 2024 నుంచి 02-11-2024 వరకు ఫలితాలు-ఆర్థికంగా బాగుంటుంది

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమకు తగిన ప్రతిఫలం ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అందుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బుధవారం నాడు పనులు పురమాయించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఒక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహస్థితి అంత అనుకూలం కాదు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. అయిన వారికి మీ సమస్యలు తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆదివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఈ సమస్యలు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం అతిగా ఆలోచింపవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయింవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక విషయాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలిల. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. శనివారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖుల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆధ్మాత్మికతపై దృష్టి సారిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. నిరుద్యోగుకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సోమవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైనా రంగంలో మంచి ఫలితాలున్నాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగి విషయాలు వెల్లడించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మంగళ, బుధ వారాల్లో శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సన్నిహితులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలు, విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా కొట్టిపారేయొద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పంద లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వివాదాలకు దూరంగా ఉండాలి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. పరధ్యానంగా ఉంటారు. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. బంధుమిత్రులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. ఆత్మీయుల హితవు మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అపజయాలకు కుంగిపోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు పోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులు ఆదాయం బాగుంటుంది. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు, బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు త్వరలో అనుకూలిస్తాయి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆరోగ్యం బాగుంటుంది. శుక్ర, శని వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. వాహనయోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మాటతీరుతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆందోళన అధికం. ప్రయాణంలో అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు చేపడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. స్తోమతకు మించి హమీలివ్వవద్దు. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానానికి శుభం జరుగుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలిస్తుంది. ఆర్థికలావాదేవీలు పురోగతిన సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. శనివారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. హోల్సేల్ వ్యాపారులకు ఒత్తిడి, చికాకులు అధికం. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.