గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (10:54 IST)

పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? హీరో నాగార్జునపై సీపీఐ నారాయణ ఫైర్

cpi narayana
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో అక్కినేని నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. పరువు, గౌరవ మర్యాదలు లేని వ్యక్తి మంత్రి కొండ సురేఖపై పరువు నష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.  
 
'పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాదా? బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్న నాగార్జున ఇప్పుడు కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. హీరోయిన్ సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ... బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా అన్ పాపులర్ అయిన నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన తర్వాత ఇక దానిపై ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాగార్జున వంటి వ్యక్తి పరువునష్టం దావా వేయడం చూస్తుంటే ఓ జోక్‌లా అనిపిస్తోంది' అని నారాయణ ఎద్దేవా చేశారు.