గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (12:23 IST)

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

gaddam prasad
తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్త స్పీకర్ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ వెల్లడించారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆ తర్వాత గడ్డం ప్రసాద్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి కేటీఆర్‌ను తదితరులు తోడ్కోని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సభాపతి స్థానం వరకు తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన చైర్ వద్దకు వెళ్ళి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభ కొనసాగుతుంది.