ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (10:12 IST)

గణేశ్ లడ్డూ వేలం పాటలో గత రికార్డులు బద్ధలు... ఎక్కడ?

laddu
వినాయకచవితి వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో ఒకటే సందడి నెలకొంటుంది. ఎంతో భక్త శ్రద్ధలతో ఆది దేవుడికి ప్రత్యేక పూజల్ చేస్తుంటారు. ఈ వేడుకల ముంగిపు దశలో జరిగే గణేశుడి లడ్డూ వేలం అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతి యేటా కూడా లడ్డూ వేలం పాటలు సరికొత్త రికార్డులు నమోదువుతున్నాయి. ఏ యేడాది కూడా రికార్డులు బ్రేక్ అవుతున్నాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు. 
 
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలం పాటల్లో గణేశుడి లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికింది. ఈ లడ్డూ ధర ఏకంగా రూ.1.87 కోట్లకు అమ్ముడుపోయింది. గత యేడాది ఇక్కడ లడ్డూ ధర రూ.1.20 కోట్లు పలికింది. ఈ యేడాది ఏకంగా రూ.67 లక్షలు పెరిగి రూ.1.87 కోట్లకు పోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది.